యెహోవా నిస్సీ
Yehovaa Nissee
UncategorizedAdded on 1/2/2019
Lyrics
యెహోవా నిస్సీ – అనుచు పాడెదం మా ధ్వజము విజయ ధ్వజమే యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును కలత చెంద కారణమే లేదుగా సడలకుండ కరముల కాధారమై శక్తి గల యేసు ఆత్మ నిలుపును సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| మనయందున్నట్టి బలము చాలును నాధుడేసు సెలవిచ్చెను పోదము ఆయుధములు భుజబలమవసరమా పరమ దేవునాత్మ మనలో నుండగా మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా|| హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం యేసు నామ శక్తే సామర్ధ్యము యేసు రాక వరకే పోరాటము జయము పొందుటే జీవిత ధ్యేయము సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా||