యెహోవా నీ నామము
Yehovaanee Naamamu
UncategorizedAdded on 11/5/2013
Lyrics
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము || యెహోవా || చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను || యెహోవా || పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే ||యెహోవ||