యెహోవాను సన్నుతించెదన్

Yehovaanu Sannuthimchedan

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 1/28/2017

Lyrics

యెహోవాను సన్నుతించెదన్
ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్
ఆ నామమునే గొప్ప చేసెదన్
హల్లెలూయా హల్లెలూయా
(2)         ||యెహోవాను||
నాకున్న సర్వము నన్ను విడచినను
నావారే నన్ను విడచి నిందలేసినను
నా యేసయ్యను చేరగా
నేనున్నానన్నాడుగా
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును
(2)         ||యెహోవాను||
నాకున్న భయములే నన్ను కృంగదీయాగా
నా హృదయం నాలోనే నలిగిపోయేగా
నా యేసయ్యను చేరగా
నన్నాదరించెనుగా
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును
(2)         ||యెహోవాను||
నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా
నాపైన చీకటియే నాన్నవరించెగా
నా దీపము ఆరుచుండగా
నా యేసయ్య వెలిగించెగా
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును
(2)         ||యెహోవాను||

Video