యెహోవాను స్తుతియించు
Yehovaanu Sthuthiyimchu
Lyricistజోఫి నయనపోగుల
UncategorizedAdded on 2/1/2015
Lyrics
యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు మహా దేవుని సేవించు – యేసుని పూజించు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త అయిన రారాజును ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| స్వరమండలముతో ఆయనను స్తుతియించు సితార స్వరములతో ఆయనను స్తుతియించు గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో తంబుర నాట్యముతో తంతి వాద్యముతో జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||