యెహోవాయే నా కాపరిగా

Yehovaayae Naa Kaaparigaa

UncategorizedAdded on 7/29/2018

Lyrics

యెహోవాయే నా కాపరిగా
నాకేమి కొదువగును
పచ్చికగల చోట్లలో
నన్నాయనే పరుండజేయును
శాంతికరమైన జలములలో
నన్నాయనే నడిపించును
(2)          ||యెహోవాయే||
గాఢాంధకార లోయలలో
నడిచినా నేను భయపడను
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
నా తోడైయుండి నడిపించును
(2)          ||యెహోవాయే||
నా శత్రువుల ఎదుట నీవు
నా భోజనము సిద్ధపరచి
నా తల నూనెతో నంటియుంటివి
నా గిన్నె నిండి పొర్లుచున్నది
(2)          ||యెహోవాయే||
నా బ్రతుకు దినములన్నియును
కృపాక్షేమాలు వెంట వచ్చును
నీ మందిరములో నే చిరకాలము
నివాసము చేయ నాశింతును
(2)          ||యెహోవాయే||

Video